SSMB28: మహేష్ బాబు కెరీర్ లోనే అత్యదిక రెమ్యునరేషన్!!


టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హ్యాండ్సమ్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటోంది. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ మహేష్ బాబుకు కెరీర్ లోనే అత్యదిక రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా తన ప్రతి సినిమాకు గొడవలు లేకుండా GMB ప్రొడక్షన్ ద్వారా లాభాల్లో షేర్స్ అందుకుంటూ వస్తున్న మహేష్ ఈ సారి కలెక్షన్స్ తో సంబంధం లేకుండా 65 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడట. చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం 50కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. మహేష్ మొదటిసారి ఒక RAW ఏజెంట్ గా కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఇక సినిమాకు వర్కింగ్ టైటిల్ గా 'పార్ధు' అని సెట్ చేసినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post