Salman Khan 'Radhe' Collections Details


ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన సల్మాన్ ఖాన్ రాధే సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా ఎదో ఒక సినిమాతో వచ్చే సల్మాన్ ఈసారి థియేటర్స్ క్లోజ్ అయినప్పటికీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిన ఈ సినిమాను 249రూపాయలకు జీ ఫ్లెక్స్/జీ 5లో పే పర్ వ్యూ ఫార్మాట్ లో రిలీజ్ చేశారు.

మొత్తానికి సినిమా మొదటి రోజు సాలీడ్ ఓటీటీ కలెక్షన్స్ అందుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. మొదటిరోజు 4.2 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయని ఇప్పటికే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఇక ఓటీటీ కలెక్షన్స్ 100కోట్లకు పైగానే వచ్చి ఉంటాయని టాక్ వస్తోంది. అయితే సినిమా స్ట్రీమింగ్ అయిన కొన్ని నిమిషాలకే టెలిగ్రామ్ లో లీక్ అవ్వడంతో కలెక్షన్స్ కు కాస్త గండి పడింది. మరి టోటల్ గా ఎంత వసూళ్లను అందుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post