Subscribe Us

Vijay Shocking Remuneration for Telugu Movie!!


కోలీవుడ్ స్టార్ విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటుంది. డిజిటల్, శాటిలైట్ , థియేట్రికల్ అన్ని రూట్లలో నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాడు. విజయ్ తో సినిమా అంటే అప్పులు చేసి కూడా పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

ఇక ఇప్పటికే శంకర్ సినిమా కోసం 150కోట్ల వరకు ఖర్చు చేయబోతున్న దిల్ రాజు తరువాత విజయ్ సినిమా కోసం అంతకుమించి అనేలా ఖర్చు చేయనున్నట్లు టాక్ వస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసం విజయ్ రెమ్యునరేషన్ దాదాపు 90కోట్ల వరకు ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడనుంది.


Post a Comment

0 Comments