విజయ్ దేవరకొండ సినిమాకు 200కోట్ల ఆఫర్? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

విజయ్ దేవరకొండ సినిమాకు 200కోట్ల ఆఫర్?


రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు ఇటీవల ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.


డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు పెద్ద సినిమాల నిర్మాతలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అయినప్పటికీ ఓటీటీ సంస్థలు వాటికి తోచినంత ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఇక లైగర్ సినిమాకు కూడా ఒక ప్రముఖ సంస్థ దాదాపు 200కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. అందులోనే శాటిలైట్ హక్కులు కూడా వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. కానీ కరణ్ జోహార్ ఆ డీల్ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు పూరి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.