కళ్ళులేని పాత్రలో అల్లు అర్జున్?


టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల ఆలోచన విధానం రోజురోజుకు మరింత విబిన్నంగా మారుతోంది. అంగవైకల్యం ఉన్న పాత్రల్లో కూడా నటించడానికి రెడీ అంటున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా కళ్ళు కనిపించని పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో అలాంటి పాత్రతో కనిపించి మంచి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం నితిన్ కూడా అందాదున్ రీమేక్ తో కాస్త అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయనున్న ఐకాన్ సినిమాలో హీరోకు కళ్ళు కనిపించవట. కళ్ళు లేకపోయినా కూడా తను అనుకున్నది సాధించే వరకు పట్టు విడువడట. మంచి సందేశంతో పాటు సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త షేడ్స్ చూపిస్తాడాని తెలుస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్న విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post