Adipurush Breaks Baahubali2 Record!


దర్శకధీరుడు రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్ బాహుబలితో పెద్ద సినిమాలకు ఒక దారి దొరికినట్లయ్యింది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఈజీగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయవచ్చని ఫిక్స్ అవుతున్నారు.  ఇక రామాయణం బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా 3డి టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ పై కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోవచ్చని టాక్ వస్తోంది.

అయితే ఒక విషయంలో ఆదిపురుష్ సినిమా టెక్నీషియన్స్ బాహుబలి రికార్డును బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ దాదాపు 8000 విఎఫ్ఎక్స్ షాట్లను కలిగి ఉందట, ఇండియాలోనే ఇది ఫస్ట్ టైమ్.  బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2 లో 2500 విఎఫ్ఎక్స్ షాట్లు ఉన్నాయి.  ఇక ఆదిపురుష్ లో అంతకంటే మూడు రెట్లు ఎక్కువగా VFX షాట్స్ సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా స్కెల్ ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post