సుశాంత్ సింగ్ మొదటి వర్థంతి.. మిస్టరీ వీడేదెప్పుడు?


బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నేటికి ఏడాది పూర్తయ్యింది. 2020లో కరోనా కారణంగా ఎంతోమంది జనాలతో పాటు ప్రముఖ సెలబ్రెటీలు కూడా మరణించారు. అయితే ఆ విషాదంలో అందరిని ఎక్కువగా కలచి వేసిన ఘటన మాత్రం ఇదే. సుశాంత్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలిన విషయం అందరికి తెలిసిందే.

మరణించి ఏడాది గడిచినా కూడా సుశాంత్ మృతికి గల అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మిస్టరీ ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ఇటీవల అతనితో సన్నిహితంగా ఉన్న మరికొంతమందిని కూడా విచారణ చేసినప్పటికీ నిజం బయటకు రాలేదు. సుశాంత్ నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి ఆ విధంగా చిత్రీకరించారా? అనే అనుమానాలు కూడా చాలానే వస్తున్నాయి. మరి ఈ ఏడాదైనా సుశాంత్ మృతికు గల అసలు కారణాలు తెలుస్తాయో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post