బాలీవుడ్ నాంది.. హీరో ఫిక్స్!


దేశ న్యాయ చట్టాల్లో ఉన్న అవకతవకలను ఎత్తి చూపించిన టాలీవుడ్ మూవీ నాంది హిందీలో కూడా రీమేక్ కానుంది. గత కొన్ని నెలలు రీమేక్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. ఇక మొత్తానికి కొద్దీ సేపటి క్రితం అధికారికంగా వివరణ ఇచ్చారు. 

దిల్ రాజు నాంది రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను హిందీలో అజయ్ దేవ్ గన్ తో రీమేక్ చేయబోతున్నారు. దిల్ రాజు - అజయ్ దేవగన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.  ప్రస్తుతం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగులో సినిమాను హరీష్ శంకర్ శిష్యుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు. మరి హిందీలో ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post