తారక్ రెమ్యునరేషన్.. 50 కొట్టడం పక్కా!


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఇటీవల కాలంలో సడన్ గా పెరుగుతోంది. RRR ముందు వరకు కూడా 25కోట్ల దగ్గరకు వచ్చిన తారక్ అనంతరం పాన్ ఇండియా ఎఫెక్ట్ తో ఒక్కసారిగా 35కోట్లను దాటించేశాడు, కొరటాల శివతో చేయబోయే సినిమాలో అన్నయ్య ప్రొడక్షన్ కూడా ఉంది కాబట్టి రిలీజ్ అనంతరం బిజినెస్ లో వాటాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇక మైత్రి మూవీ మేకర్స్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చేయబోయే సినిమాకు ఈజీగా 40కోట్లు అందుకోవచ్చని సమాచారం. ఈ లెక్కన RRR తరువాత వచ్చే మూవీ తో 50కోట్లను కొట్టడం తారక్ కు పెద్ద కష్టమేమీ కాదు. ఒక విధంగా బాలీవుడ్ స్టార్స్ కంటే కూడా మన స్టార్స్ ఇప్పుడు ఎందులోను తక్కువ కాదు. ఇక ప్రశాంత్ నీల్ అనంతరం బుచ్చిబాబు స్క్రిప్ట్ అనుకున్నట్లు సెట్టయితే సెట్స్ పైకి రావచ్చు. అలాగే అట్లీతో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది.


Post a Comment

Previous Post Next Post