2022: సంక్రాంతికి రాబోయే సినిమాలు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం నెలకొంది. ఫస్ట్ వేవ్ నుంచి కొంచెంకొంచెంగా కోలుకుంటున్న ఇండస్ట్రీకి మళ్ళీ సెకండ్ వేవ్ కు గట్టి దెబ్బ పడింది. అసలు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇక సంక్రాంతికి కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది.

అసలైతే 2022 సంక్రాంతి మహేష్ బాబు సర్కారు వారి పాట, అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు రావాల్సింది. కానీ సెకండ్ వేవ్ వలన షూటింగ్ పనులు అలస్యం కావడం వలన సమ్మర్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప, శ్యామ్ సింగరాయ్, F3 సినిమాలు 2022 సంక్రాంతికి రావచ్చని సమాచారం. ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కూడా పొంగల్ ను టాక్ చేసినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post