బాలయ్యతో యువరాజ్ సింగ్.. అసలు స్టోరీ!


బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయనతో దిగిన ఫొటో కూడా షేర్ చేసుకోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలియని వారు కొందరు అసలు వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

అసలు మ్యాటట్ లోకి వెళితే.. బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ కోసం 2015లో యువరాజ్ సింగ్ బాలయ్యను కలిశాడు. యువరాజ్ కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ భారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే YOUWECAN అనే ప్రోగ్రాం ద్వారా క్యాన్సర్ రోగుల కోసం మంచి చేసేందుకు యూవీ సిద్ధమయ్యాడు. సహాయం అంధించడమే కాకుండా వారికి స్ఫూర్తిని ఇవ్వాలని పర్సనల్ గా కలుసుకుంటున్నాడు. ఆ విధంగా బాలకృష్ణ కొనసాగిస్తున్న బసవతారకం హాస్పిటల్ గురించి తెలుసుకొని బాలయ్యతో కలిసి వర్క్ చేసేందుకు ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఓ మంచి పనితో యువరాజ్ బాలకృష్ణ సన్నిహితులుగా మారారు.


Post a Comment

Previous Post Next Post