మెగాస్టార్ కోసం రూ.4కోట్ల నటుడు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించాడనికి పరభాషా నటీనటులు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఆసక్తి చూపిస్తున్నారు. కథ పాత్రలు నచ్చితే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి - బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం కూడా ఒక టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్ ను దింపుతున్నట్లు తెలుస్తోంది.

ఆ నటుడు మరెవరో కాదు. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా తన పాత్రతోనే సినిమాకి సరికొత్త రూపాన్ని తేగలడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పవర్ఫుల్ పాత్ర కోసం దర్శకుడు బాబీ అతన్ని ఫిక్స్ చేసుకున్నాడట. అయితే నవాజుద్దీన్ సిద్దిఖీకి ఇంకా కథ చెప్పలేదు. ఒకవేళ అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తే నెల రోజుల డేట్స్ కోసం మినిమమ్ 4కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అతను ఒప్పుకుంటాడో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post