Is it going to be Major Highlight in RRR?
Wednesday, June 30, 2021
0
RRR సినిమా ఎప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వస్తుందో గాని ఆ మూవీ పెంచుతున్న ఆశలు మాత్రం మామూలుగా లేవు. సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ గురించి ఎవరో ఒకరు లీక్ చేస్తున్నారు. ఇక RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎదురిపడి కొట్టుకునే ఫైట్ ఎమోషనల్ గా ఉంటుందని రచయిత కె.విజయేంద్రప్రసాద్ ఇదివరకే క్లారిటీ ఇచ్చేశారు.
ఇక అందులో వర్షంలో ఉండే ఫైట్ కూడా హై వోల్టేజ్ డ్రామాను క్రియేట్ చేస్తుందని టాక్ వస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరు కూడా విలన్స్ ను చితకొట్టే రేయిన్ ఫైట్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. సాధారణంగా రెయిన్ ఫైట్ అంటేనే మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఇక రాజమౌళి కాబట్టి ఉరుములు, మెరుపుల నడుమ వెండితెరపై మరింత హై వోల్టేజ్ డ్రామా కొనసాగడం పక్కా.
Follow @TBO_Updates
Tags