Subscribe Us

అల్లు అర్జున్ మరో బిగ్ బడ్జెట్ మూవీ!


పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియదు గాని ఆ తరువాత రాబోయే సినిమాలు కూడా అంతకు మించి అనేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఒక తమిళ ప్రొడ్యూసర్ ఇచ్చిన క్లారిటీని బట్టి బన్నీ మరో బిగ్ బడ్జెట్ సినిమాను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ నిర్మాత మరెవరో కాదు. అసురన్ నిర్మాత కలైపులి ఎస్ తను. అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని ఆయన ఒక తమిళ ఛానెల్ కు వివరణ ఇచ్చారు. అసలైతే బన్నీతో ఆయన గత కొన్నేళ్లుగా సినిమా చేయాలని ట్రై చేస్తిన్నాడు. ఒకసారి లింగుస్వామితో బైలాంగ్యువల్ సినిమా ఫిక్స్ అయ్యింది. కానీ కథపై అనుమానంతో బన్నీ తప్పుకున్నాడు. అల్లు అరవింద్ కు అలాగే నిర్మాత కలైపులికి మంచి అనుబంధం ఉంది. అందుకే అల్లు అర్జున్ తో కమిట్మెంట్ ఇంకా అలానే ఉంది. ఇక త్వరలోనే బన్నీ కోసం మంచి కథను సెట్ చేసి బిగ్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించాలని కలైపులి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

0 Comments