కోలీవుడ్ టాలెంటెట్ హీరో ధనుష్ మొదటిసారి ఒక డైరెక్ట్ తెలుగు దర్శకుడితో ట్రిలాంగ్యువల్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల అతనితో ఎలాంటి సినిమా చేస్తాడో గాని తప్పకుండా ఆ సినిమా తెలుగులో కూడా హిట్టవుతుందని చెప్పవచ్చు.
ఇక ఆ సినిమా రాకముందే మరికొన్ని తెలుగు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. హారిక హాసిని సంస్థ నుంచి పుట్టుకొచ్చిన సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూడా ధనుష్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు స్క్రిప్ట్ లు కూడా రెడీ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇక సీతారా ఎంటర్టైన్మెంట్స్ విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment