టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా RRR ప్రేక్షకులను ఎంతగా ఊరిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో రోజురోజుకు అంచనాల డోస్ అకాశాన్ని దాటేస్తున్నాయి.
దానికి తోడు అజయ్ దేవగన్ లాంటి బడా హీరో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడంతో హిందీలో కూడా సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఆయన పాత్ర గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇకపోతే ఎన్టీఆర్ చేస్తున్న కొమురం భీమ్ పాత్రకు తండ్రి పాత్రలో కనిపిస్తాడట. అజయ్ దేవగన్ ఒక పోరాట యోధుడిగా నటిస్తున్నట్లు టాక్ వస్తోంది. తండ్రి స్ఫూర్తితో కొమరం భీమ్ మరింత బలంగా పోరాటం చేస్తాడట. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment