జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో లాభాలను అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన కామెడీ సినిమా కావడంతో జనాలు ఒక్కసారిగా ఎగబడి చూసేశారు. అయితే ఆ సినిమా దర్శకుడు అలాగే హీరోకు వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ హీరోయిన్ ఫారియా అబ్దుల్లాకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆమె మరీ ఎక్కువ హైట్ ఉండడం కూడా పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఇక మొత్తానికి మంచు విష్ణు సినిమాలో ఒక ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న డీ అండ్ డీ లో హీరోయిన్ పాత్రకు ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక కరోనా పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చిన అనంతరం ఈ కామెడీ సినిమాను సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment