బోయపాటి చేతికి తమిళ సింగం!


బోయపాటి శ్రీను చేతికి మాస్ హీరో దొరికితే ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అప్పుడప్పుడు డోస్ మరీ ఎక్కువవ్వడంతో ఊహించని డిజాస్టర్స్ ను ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఎలాగైనా బాలకృష్ణ తో చేస్తున్న అఖండ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 

ఇక బోయపాటికి అల్లు అర్జున్ తో కూడా ఒక కమిట్మెంట్ అయితే  ఉంది. అఖండ అనంతరం బన్నీతో సినిమా చేస్తాడా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించకపోతే హీరోలైనా దర్శకులను నిర్ణయాలను మార్చేసుకుంటున్నారు. ఇక బోయపాటి తమిళ్ హీరో సూర్యను కూడా టచ్ చేస్తున్నట్లు ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. సింగం లాంటి మాస్ కమర్షియల్ సిరీస్ లతో తన బాక్సాఫీస్ స్టామినా పెంచుకున్న సూర్య బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పక్కా మాస్ సినిమా తియ్యగలడని చెప్పవచ్చు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post