జీవిత రాజశేఖర్ 200కోట్ల ప్రాపర్టీ.. స్టార్ హీరో వైఫ్ బేరాలు?


టాలీవుడ్ ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ ఎక్కువగా సినిమాలతో కాకపోయినా ఎదో ఒక విషయంతో మాత్రం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. ఇక ఇటీవల వారి ఆస్తులకు సంబంధించిన కథనాలు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జీవిత రాజశేఖర్ కు సంబంధించిన 200కోట్ల ప్రాపర్టీని ఒక స్టార్ హీరో సతీమణి కొనేందుకు బేరాలు ఆడుతున్నట్లు టాక్ వస్తోంది.

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో జీవిత రాజశేఖర్ కు 200కోట్ల విలువ చేసే ఒక ప్రాపర్టీ ఉందట. ఇక ఆ ప్రాపర్టీని కొనేందుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాపర్టీని అమ్మేసి మరొక చోట కొత్త ల్యాండ్ ను కొనుగోలు చేయాలని జీవిత రాజశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.


Post a Comment

Previous Post Next Post