కన్నడ స్టార్ యష్ నుంచి రానున్న KGF సెకండ్ చాప్టర్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత ఏడాది నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కరోనా కారణంగా రెండు సార్లు రిలీజ్ డేట్స్ ను మార్చాల్సి వచ్చింది. అసలైతే ఈ ఎడాది జూలై 16న విడుదల చేయాలని అనుకున్నారు.
సెకండ్ వేవ్ దెబ్బకు మళ్ళీ మార్చాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం సెప్టెంబర్ 9 అని ఒక కొత్త డేట్ అయితే వైరల్ అవుతోంది. వినాయకచవితి సెప్టెంబర్ 10న ఉండడం వలన హాలిడేస్ కలిసి రావడమే కాకుండా శుక్రవారం వస్తోంది. శని, ఆదివారం వీకెండ్స్ కాబట్టి తప్పకుండా ఓపెనింగ్స్ గట్టిగానే వస్తాయి. పైగా పెద్ద సినిమాలు వచ్చే అవకాశం లేదు. నిర్మాతలైతే ఆ డేట్ బెస్ట్ అని అనుకుంటున్నారు. ఒకవేళ మళ్ళీ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పడితే డిసెంబర్ పై ఫోకస్ పెట్టనున్నారు.
Follow @TBO_Updates
Post a Comment