ప్రశాంత్ నీల్ KGF2 ను పట్టించుకోవట్లేదా?


కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు KGF 2కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని పనులు మిగిలి ఉన్నట్లు టాక్ వస్తోంది.

నిజానికి షూటింగ్ అయితే ఎప్పుడో పూర్తయ్యింది. కాకపోతే ఒక సీన్ మాత్రం మళ్ళీ రీ షూట్ చేయాలని అనుకుంటున్నారట. కానీ ప్రస్తుతం ఆ సినిమాను పక్కన పెట్టిన ప్రశాంత్ సలార్, ఎన్టీఆర్ అంటూ తెలుగు సినిమాలతో బిజీ అయ్యాడనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కన్నడ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా అలా వదిలేయడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. కానీ ప్రశాంత్ మాత్రం అలా ఆలోచించడం లేదు. రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చిన తరువాత సినిమాను పూర్తిగా రెడీ చేస్తే బావుంటుందని అనుకుంటున్నాడు. అలాగే ప్రమోషన్స్ కూడా సాలీడ్ గా ఉండాలని అనుకుంటున్నాడట. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post