మహేష్ లానే బాలయ్య కూడా షాక్ ఇచ్చాడుగా!


టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ మొదటి నుంచి కూడా దర్శకుడిగా అనిల్ రావిపూడి మంచి హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అనిల్ అంత సక్సెస్ రేట్ లేని హీరోలు కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతుంటే అనిల్ మాత్రం ఇంకా F3 తరువాత ఎవరితోను ఫైనల్ చేసుకోలేదు.

మొన్న కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అనిల్ సినిమా ఎనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ వచ్చింది. నిజానికి అంతకుముందు ఇంటర్వ్యూలోనే మహేష్ సినిమా ఉంటుందని అనిల్ వివరణ ఇచ్చారు. ఇక బాలకృష్ణతో కూడా చర్చలు జరుగుతున్నాయి అని త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. కానీ గోపిచంద్ మాలినేని సినిమాను ఓకే చేసిన బాలయ్య అనిల్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ కాంబో ఇప్పట్లో సెట్స్ పైకి రాకపోవచ్చని టాక్ వస్తోంది. మరోవైపు అనిల్ దృష్టిలో శర్వానంద్ కూడా ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. మరి F3 అనంతరం అనిల్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post