రామ్ చరణ్ అస్సలు తగ్గట్లేదు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోలందరు కూడా పాన్ ఇండియా సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఒక్కసారి అలాంటి అవకాశం వచ్చినా కూడా ఏ మాత్రం వదులుకోవద్దని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ప్రభాస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ RRR తరువాత ఎలాంటి సినిమా చేస్తాడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

శంకర్ తో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయినప్పటికీ ఇండియన్ 2 కారణంగా ఆలస్యం కావచ్చని టాక్ వస్తోంది. ఇక RRR ముగిసిన తరువాత తెలుగులోనే ఏదైనా ఒక చిన్న సినిమా చేయమని కొందరు సలహా ఇస్తున్నారట.  కొందరు నిర్మాతలైతే కథలను కూడా పంపిస్తున్నారట. కానీ రామ్ చరణ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. చేస్తే మళ్ళీ పాన్ ఇండియా సినిమానే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ మధ్య జెర్సీ డైరెక్టర్, అలాగే ఛలో దర్శకుడు కూడా కథలు చెప్పారని టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే చరణ్ చాలా క్లియర్ గా ఉన్నాడట. ఏ మాత్రం తొందరపడకుండా మంచి పాన్ ఇండియా కథ వచ్చినపుడే ఫిక్స్ అవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post