ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఎంతవరకు వచ్చిందంటే?


జూనియర్ ఎన్టీఆర్ రెండవసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే బిగ్ బాస్ హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన తారక్ ఇప్పుడు సరికొత్తగా విజ్ఞానం వినోదాన్ని అంధించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

అసలైతే ఈ షోను గత ఏడాదిలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త కంట్రోల్ లోకి రావడం వలన జెమినీ టీమ్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో పడింది. ముందుగా తారక్ లుక్ టెస్ట్ కోసం రెండు రోజులు ప్రాక్టీస్ చేయనున్నాడు. అనంతరం రెగ్యులర్ షోను మరో నెలలో స్టార్ట్ చేయవచ్చట. పరిస్థితులు అనుకూలిస్తే మరో రెండు వారాల్లో కూడా రెగ్యులర్ షూట్ మొదలు కావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post