బాలీవుడ్ అంటే ఎంత తీసుకుంటుందో..? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Boxoffice Collections

బాలీవుడ్ అంటే ఎంత తీసుకుంటుందో..?


సౌత్ ఇండస్ట్రీలో గత 18 ఏళ్లుగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లలో నయనతార ఒకరు. పర్సనల్ గా లవ్ సమస్యలు ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ ఎప్పుడు కూడా ఆ ప్రభావాన్ని సినిమాలపై పడనివ్వలేదు. ఇక రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా పట్టించుకోదు.

సౌత్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న నయన్ మొదటిసారి బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్నట్లు టాక్ వస్తోంది. షారుక్ ఖాన్ - అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో అమ్మడు హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. సాధారణంగా సౌత్ సినిమాలకు 4 నుంచి 5కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్న నయన్ ఇక హిందీ సినిమా కాబట్టి మరో రెండు పెంచినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వేళ అక్కడ హిట్టు కొడితే 40లో కూడా అమ్మడి హవా కొనసాగడం పక్కా. ప్రస్తుతం నయన్ వయసు 36.