Subscribe Us

Nani BIG project with Hit Director?


నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాతో రెడీగా ఉన్న విషయం తెలిసిందే. పరిస్థితులు ఏ మాత్రం అదుపులోకి వచ్చినా సినిమాను రిలీజ్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సెకండ్ వేవ్ డోస్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇక నాని వరుసగా మరో రెండు సినిమాలను కూడా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ గట్టిగానే వేసుకున్నాడు. ఇక 'అంటే సుందరానికి' అనే సినిమా కూడా లైన్ లో ఉండాగా ఇప్పుడు మరొక దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు వకీల్ సాబ్ సినిమాతో ఇటీవల స్టార్ ఇమేజ్ అందుకున్న వేణు శ్రీరామ్. గతంలో ఈ దర్శకుడు నానితో MCA అనే సినిమా కూడా చేశాడు. ఇక ఇటీవల మరొక కథపై చర్చలు జరిపినట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఆ కాన్సెప్ట్ కు బడ్జెట్ గట్టిగానే అవుతుందట. మరి ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాను దిల్ రాజు నిర్మిస్తారా లేదా మరో నిర్మాత చేతుల్లోకి వెళుతుందా అనేది చూడాలి.


Post a Comment

0 Comments