ప్రభాస్ తమ్ముడు తగ్గట్లేదుగా.. చేతిలో 5 సినిమాలు!


వర్షం సినిమాతో మొదటి బాక్సాఫీస్ హిట్ చూసిన ప్రభాస్ ఆ విజయాన్ని ఇచ్చిన దర్శకుడిని ఎప్పటికి మరచిపోలేడనే చెప్పాలి. ఎవరైనా సరే ప్రభాస్ తో ఒక్కసారి కనెక్ట్ అయితే అంత ఈజీగా దూరం అవ్వరు. ఇక వర్షం డైరెక్టర్ శోభన్ మృతి అనంతరం ఆ ఫ్యామిలీకి ప్రభాస్ అండగా ఉంటున్నాడు.

శోభన్ కొడుకు సంతోష్ శోభన్ మొదట్లో హీరోగా అడుగులు వేసినప్పుడు ప్రభాస్ బాగానే సపోర్ట్ చేశాడు. కానీ ఆ సినిమాలేవి అనుకున్నట్లుగా సక్సెస్ కాకపోవడంతో ఒక అన్నయ్యలా చెరదీసి హిట్టు వచ్చేలా చేశాడు. సంతోష్ బాధ్యతను యూవీ క్రియేషన్స్ కు అప్పగించగా వాళ్ళు యూవీ కాన్సెప్ట్స్ లో ఏక్ మినీ కథ సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందించారు. ఆ హిట్టుతో ప్రస్తుతం సంతోష్ 5 సినిమాలతో లైన్ లో పెట్టాడు. యూవీ క్రియేషన్స్ లోనే మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక రీసెంట్ మారుతి సెట్ చేసిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'ప్రేమ్ కుమార్' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక స్వప్న సినిమాస్ లో అలాగే సుష్మితా కె ప్రొడక్షన్ లో కూడా సినిమాలు చేయడానికి కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post