ప్రభాస్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అల్లు అర్జున్, రణబీర్ కపూర్ వంటి స్టార్స్ కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలను కలిగి ఉన్న భారతీయ సినీ ప్రముఖులు. ఇక ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ కూడా చేరాడు. రేంజ్ రోవర్ యొక్క ఆటోబయోగ్రఫీ మోడల్ కారు త్వరలో పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకుంటుందట.
దాదాపు రూ .4 కోట్ల విలువైన ఎస్‌యూవీని బుక్ చేసినట్లు సమాచారం. గతంలో అయితే ఇతర స్టార్స్ తరహాలో పవన్ కార్లపై పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. కానీ ఇప్పుడు 4కోట్ల విలువైన కారును కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో సిద్దమవుతున్న పవన్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు హరీష్ శంకర్ ప్రాజెక్టుతో కూడా బిజీ కానున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment