పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డేట్స్ ఇవ్వలే గాని బడా దర్శల నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే డార్లింగ్ ను చేతుల్లో పెట్టుకున్న యూవీ క్రియేషన్స్ మాత్రం అతన్ని అంతగా యూజ్ చేసుకోవడం లేదు. నిజానికి రాధేశ్యామ్ కోసం కేటాయించిన డేట్స్ మరొక ప్రొడక్షన్ కు ఇచ్చి ఉంటే ఈపాటికే రెండు సినిమాలను పూర్తి చేసేవారు.
యూవీ ప్లానింగ్ పై ఇప్పటికే అభిమానులు కొండంత కోపంతో ఉన్నారు. అప్డేట్స్ ఇవ్వరు షూటింగ్స్ అంత త్వరహా ఫినిష్ చేయరని ఎప్పటి నుంచో కామెంట్స్ వస్తున్నాయి. ఇక రాధేశ్యామ్ షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ తట్టుకోలేక మొహం మీదే అడిగేసినట్లు తెలుస్తోంది. అసలు దర్శకుడు కరెక్ట్ గా ఉంటే షూటింగ్ ఇంత ఆలస్యం అవ్వదు. అందుకే ప్రభాస్ ఓపెన్ గా రాధాకృష్ణకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రభాస్ మరింత బిజీ అవుతాడు. ఏ మాత్రం తేడా వచ్చినా మిగతా సినిమా షెడ్యూల్స్ కూడా తారుమరవ్వడం కాయం. అందుకే రాధేశ్యామ్ నుంచి తొందరగా బయటపడాలని చూస్తున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment