ఆదిపురుష్ కోసం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్!


రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందరి చూపు ఎక్కువగా ఆదిపురుష్ సినిమాపైనే ఉంది. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 3డీ ఫార్మాట్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను రూపొందిస్తున్నారు.

ఇక సినిమాకు ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.  భార్య భర్తలైన సంగీత ద్వయం సాచెట్ టాండన్ - పరంపర ఠాకూర్ తో దర్శకుడు చర్చలు జరిపినట్లు సమాచారం. వీరు ఇదివరకే టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, బట్టి గుల్ మీటర్ చాలు, మరియు కబీర్ సింగ్ వంటి అనేక చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఓం రౌత్  తన్హాజీలో కొన్ని పాటలను కూడా వాళ్లే కంపోజ్ చేశారు. ఇప్పుడు ఓం రావత్ మరోసారి వారికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలోని మొత్తం పాటలను కంపోజ్ చేసే ఛాన్స్ ఇచ్చారా లేక ఇదివరకటి లాగా కొన్ని పాటలకే పరిమితం చేశారా అనేది తెలియదు. మరి సాహో తరహాలోనే ఈ సినిమాకు కూడా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.


Post a Comment

Previous Post Next Post