దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అంత తొందరగా రాదు అనేది అందరికి తెలిసిన విషయమే. ఎదో ఒక విధంగా అభిమానుల సహనానికి పరీక్ష పెట్టడం కామన్. ఇక RRR లాంటి బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాకు ఈసారీ కరోనా సహకారం వలన మరో ఏడాదికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2021 అక్టోబర్ 13న రానున్నట్లు చాలా రోజులుగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అభిమానులు కూడా అదే నిజమని అనుకున్నారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ వలన సినిమా షూటింగ్ కు బ్రేకులు పడడంతో మరోసారి వాయిదా తప్పట్లేదట. ఇక సినిమాను 2022 ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని కొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
0 Comments