పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమా సినిమాకు డిమాండ్ మరింత ఎక్కువవుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ వలన ఓటీటీ ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తున్నాయట.
రాధేశ్యామ్ సినిమాను జూలై 30న విడుదల చేసే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. మరోసారి వాయిదా వేయడానికి యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇటీవల ఆ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ పోటాపోటీగా ఆఫర్స్ ప్రకటించినట్లు సమాచారం. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ నుంచి 400కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment