టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇంకా సరైన రేంజ్ లో హిట్ కొట్టడం లేదు. మొదటి సినిమా 'ఈ నగరానికి ఏమైంది?' మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత చేసిన ఫలక్ నుమా దాస్ అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు.
ఆ సినిమాకు విశ్వక్ డైరెక్షన్ తో పాటు నిర్మాణ బాధ్యతను కూడా మోసాడు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు సీక్వెల్ రెడీ చేస్తున్నట్లు ఒక టాక్ వస్తోంది. మెయిన్ స్టోరి రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ పాగల్ విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment