సలార్ సినిమాకు 130కోట్ల ఆఫర్.. బడ్జెట్ వచ్చేసినట్లే!


రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తుంటే ఒకేసారి లక్ష్మీ బాంబ్ వాలాను రెడీ చేస్తున్నట్లు ఉంది. రాధేశ్యామ్, ఆ వెంటనే సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విదంగా బ్లాస్ట్ చేసేలా ఉన్నాయి. సలార్ సినిమాపై అయితే ఒక విదంగా మరింత ఎక్కువ హైప్ క్రియేట్ అవుతోంది.

ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను దాదాపు రూ.150కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు నాన్ థియేట్రికల్ గానే పెట్టిన బడ్జెట్ మొత్తం వెనక్కి వచ్చేలా ఉంది. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ కోసం ఒకేసారి 130కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. చర్చల దశలోనే ఉంది కాబట్టి మరికొంత ఎక్కువ కూడా డిమాండ్ చేయవచ్చు. ఇక శాటిలైట్ హక్కులకు సంబంధించిన డీల్ కూడా చర్చల్లో ఉంది కాబట్టి ఈ లెక్కన సలార్ రిలీజ్ కు ముందే పెట్టిన బడ్జెట్ ను వెనక్కి తేవడమే కాకుండా ప్రాఫిట్స్ లోకి రప్పించే అవకాశం ఉంది.


Post a Comment

Previous Post Next Post