ఓటీటీ వెబ్ కంటెంట్ అనగానే ఈ రోజుల్లో స్టార్స్ ఏ మాత్రం నో చెప్పడం లేదు. వీలైనంత వరకు రెమ్యునరేషన్ కాస్త తక్కువైనా పరవాలేదని ఒకే చెప్పేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో వెబ్ సిరీస్ లకు డిమాండ్ గట్టిగానే ఉంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి కంపెనీలు సినిమాలకు ఇచ్చినట్లుగానే సాలిడ్ రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు.
ఇక మొన్నటివరకు తమన్నా, కాజల్ అగర్వాల్ ఆ రూట్లో గట్టిగానే ప్రయత్నాలు చేశారు గాని డిజాస్టర్ అందుకున్నారు. కానీ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించిన విధానం అందరిని షాక్ కు గురి చేసింది. కంప్లీట్ గా తన స్టార్ హోదాను పక్కన పెట్టి డీ గ్లామరస్ రోల్ లో కనిపించింది. ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దీంతో నెట్ ఫ్లిక్స్ సమంత డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు హాట్ స్టార్ నుంచి కూడా రెండు ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అయితే సమంత రెమ్యునరేషన్ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం తనకు నచ్చిన కంటెంట్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. త్వరలోనే మరొక వెబ్ సిరీస్ తో అప్డేట్ రానున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment