నేను చేసిన తప్పు అదే: శ్రీను వైట్ల!


ఈవివి.సత్యనారాయణ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కామెడీ దర్శకుడిగా క్రేజ్ అందుకున్న వారిలో శ్రీనువైట్ల మొదటి స్థానంలో ఉంటాడు. అప్పట్లో అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకునేవి. వెంకీ, ఢీ, రెడీ, దూకుడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆ తరువాత బాద్‌షా నుంచి వైట్ల మేకింగ్ రొటీన్ అనే కామెంట్స్ వచ్చాయి. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు డిజాస్టర్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే దానికి కారణం నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా సినిమాలు చేయడమే అని శ్రీను వైట్ల వివరణ ఇవ్వడం విశేషం. సాధారణంగా ఎవరైనా సీనియర్ దర్శకులు ప్లాప్స్ ఎదురైతే నేటి ట్రెండ్ ను ఫాలో అవ్వలేక పరాజయాలు వచ్చినట్లు చెబుతారు. కానీ వైట్ల మాత్రం అందుకు భిన్నంగా నేను నా శైలిని వదిలి పెట్టడంతో ప్రేక్షకులు ఆమోదించలేదని చెప్పాడు. 'డీ అండ్ డీ' తో మళ్ళీ తన కామెడీ ట్రాక్ లోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.  అయితే వైట్ల ఆగడు, బ్రూస్‌లీ ఆయన శైలిలో తరకెక్కినవే. మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ మాత్రమే కాస్త కొత్తగా ట్రై చేశారు. మరి ఇప్పుడు ఎలా ట్రై చేస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post