అభిమానుల బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు వేసిన హీరో!


కేవలం సినిమా రిలీజ్ సమయంలోనే చాలామందికి అభిమానులు గుర్తుకు వస్తారు. కొందరు తప్పక ఇవ్వాలి అనే ఆలోచనతో విరాళం ప్రకటించి చేతులు దులిపేసుకుంటారు. అయితే చాలా తక్కువమంది హీరోలకు మాత్రమే అభిమానులపై కృతజ్ఞత భావం ఉంటుంది. అలాంటి వారిలో సూర్య ఒకరు.

ఆయన ఎలాంటి సహాయం చేసినా కూడా పెద్దగా బయటకు రానివ్వరు. అప్పుడప్పుడు అభిమానుల ద్వారానే ఆ సహాయలు అందరికి తెలుస్తుంటాయి. రీసెంట్ గా సూర్య తన ఫ్యాన్స్ క్లబ్ లో ఉన్న అభిమానుల కష్టాల గురించి తెలుసుకొని సహాయం చేసినట్లు సమాచారం. దాదాపు 250మంది అభిమానులు కరోనా వలన ఉపాధి కోల్పోవడంతో వారికి బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా 5000రూపాయలను వేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.12.5లక్షల వరకు అభిమానులకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post