సంక్రాంతికి పవన్ రావడం పక్కా.. కానీ ఆ సినిమాతో కాదు!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ తన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో ఓపెనింగ్స్ తోనే చూపించారు. కరోనా లేకపోయి ఉంటే ఆ సినిమా మరో రేంజ్ లో కలెక్షన్స్ అందుకునేది. ఇక అందరూ కూడా హరహర వీరమల్లు సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ 40% పూర్తయ్యింది. సెకండ్ వేవ్ దెబ్బ పడడంతో సంక్రాంతికి విడుదల చేయడం కష్టమని తెలిసిపోయింది. ఇక సంక్రాంతికి అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తోనే రావచ్చని టాక్ వస్తోంది. రానా ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా దసరా సమయంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే రిస్క్ లేకుండా 2022 సంక్రాంతిని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post