మరో పాన్ ఇండియా సినిమాలో మిల్కీ బ్యూటీ?


టాలీవుడ్ మిల్కి బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తమన్నా భాటియా ఎప్పటికప్పుడు తన స్టార్ డమ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక చాలా రోజుల అనంతరం అమ్మడికి మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 

కన్నడ KGF స్టార్ యష్ చేయబోయే తదుపరి యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. నర్థన్ దర్శకత్వంలో చేయబోయే బిగ్ బడ్జెట్ సినిమాలో యష్ ఒక నేవి ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. బాహుబలి, సైరా వంటి పాన్ ఇండియా సినిమాల అనంతరం తమన్నా మూడవ పాన్ సినిమాలో ఛాన్స్ అందుకోవడం విశేషం. మరి ఆ సినిమాతో అమ్మడి క్రేజ్ ఇంకా ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post