తెలుగు మాస్టర్ చెఫ్.. తమన్నాకు భారీ ఆఫర్!


టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ తారలు హోస్ట్ గా చేయడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆ రూట్లో అందరూ సక్సెస్ అవ్వడం లేదు. ఎదో ఒక రకంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా వంటల ప్రోగ్రాం హోస్ట్ గా మారోబోతున్నట్లు సమాచారం.

ఇంటర్నేషనల్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంను ఇండియన్ లాంగ్వేజెస్ లలో కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇక తెలుగులో ఆ అవకాశం తమన్నాకు దక్కినట్లు తెలుస్తోంది. ఆమెకు భారీ ఎమౌంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ్ లో విజయ్ సేతుపతి చేస్తుండగా, కన్నడలో కిచ్చా సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మళయాళంలో పృథ్వీరాజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక తమన్నా తెలుగు భాషలో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఆమె నెక్స్ట్ సీటిమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post