క్షమాపణ చెప్పేస్తా.. వివాదంపై స్పందించిన హైపర్ ఆది! - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

క్షమాపణ చెప్పేస్తా.. వివాదంపై స్పందించిన హైపర్ ఆది!


జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవల శ్రీదేవి కంపెనీ డ్రామా షోలో తెలంగాణ యాసను, బతుకమ్మను కించపరిచే విధంగా మాట్లాడాడు అని పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ హైపర్ ఆదిపై అలాగే మల్లెమాల సంస్థపై కూడా కేసు నమోదు చేయగా ఈ వివాదంపై స్వయంగా హైపర్ ఆది స్పందించి క్షమాపణలు చెబుతానని అన్నాడు.

తెలంగాణ జాగృతి ఫెడ‌రేష‌న్ స‌భ్యులు ఇటీవల హైపర్ ఆదికి ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేయగా హైపర్ ఆది మీడియా ముందే వివరణ ఇచ్చాడు. నిజానికి ఆ స్క్రిప్ట్ తాను రాయలేదని స్టేజ్ మీద 20 మంది ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని సమయంలో ఫ్లోలో ఏదైనా అని ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆది వివరణ ఇచ్చాడు. ఎవరిని కించపరచాలనే ఉద్దేశ్యం తనకు అసలు లేదని ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తే క్షమాపణ చెప్పడానికి ఏ మాత్రం సందేహించను అంటూ.. బేషరతుగా క్షమాపణలు చెబుతానని ఈ జబర్దస్త్ కమెడియన్ తగ్గి మాట్లాడాడు.