టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అల.. వైకుంఠపురములో హిందీలో కూడా రాబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యదిక వసూళ్లను అందించి 250కోట్ల గ్రాస్ చేయడంతో ఈ సినిమా రీమేక్ పై బాలీవుడ్ స్టార్స్ ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టారు. ఇక మొత్తానికి గీత ఆర్ట్స్ రంగంలోకి దిగి టీమ్ ను సెట్ చేసే పనిలో బిజీ అయినట్లు తెలుస్తోంది. ఇక హీరోగా కార్తిక్ ఆర్యన్, హీరోయిన్ గా కృతి సనోన్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను గీత ఆర్ట్స్ తెలియజేయనుంది.
Follow @TBO_Updates
Post a Comment