బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరీ సీతారామరాజు పాత్రకు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆ సినిమా కోసం రెండు వారాలు కూడా కష్టపడని అలియాకు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలియా భట్ 13రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొందట. అయినప్పటికీ ఆమెకు 6కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. కనిపించేది కొద్దీ సేపు మాత్రమే అయినా అలియా పాత్ర సినిమాలో హైలెట్ అవ్వడం కాయమని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లోనే రావచ్చని తెలుస్తోంది. ఇక వచ్చే నెలలోనే దర్శకుడు ఈ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment