రెండవ భార్యకు కూడా విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి విడాకుల న్యూస్ తో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. మొదటి భార్య రీనా దత్తాతో 16 ఏళ్ల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన ఈ సీనియర్ హీరో 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం లాగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. 

ఇక ఆమెతో 15 ఏళ్ల పాటు కొనసాగిన అమీర్ ఖాన్ మొత్తానికి విడిపోతున్నట్లు వివరణ ఇచ్చారు. ఇన్నేళ్ల మ్యారేజ్ లైఫ్ లో ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామని అయితే కొన్ని కారణాల వలన భార్యాభర్తల బంధానికి స్వస్తి చెబుతున్నట్లు అధికారికంగా వివరణ ఇచ్చారు. 15 రోజుల క్రితమే ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నారట. అయితే విడిపోయి ఉండడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న తరువాతే విడాకులపై క్లారిటి ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పారు. ఇక వీరికి 2011లో సర్రోగసి ద్వారా కుమారుడు ఆజాద్ జన్మించాడు. భార్యాభర్తలుగా కాకుండా అతనికి మంచి తలిదండ్రులుగా ఉండేందుకు కృషి చేస్తామని కూడా అమీర్ ఖాన్, కిరణ్ రావ్ వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post