అనుష్క శెట్టితో విజయ్ దేవరకొండ?


టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో సినిమా చేస్తున్నట్లు టాక్ మొదలైంది. చివరగా నిశ్శబ్దం సినిమాతో డిజాస్టర్ చూసిన అనుష్క నెక్స్ట్ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ లో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఆ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తుండగా సినిమాని రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్నాడు. ఇక కథను మలుపు తిప్పే ఒక ముఖ్యమైన పాత్రలో విజయ్ దేవరకొండ కూడా నటిస్తాడని తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. ఇక సినిమాకు ms శెట్టి mr పొలిశెట్టి అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Post a Comment

Previous Post Next Post