'మా' బిల్డింగ్.. మళ్ళీ మెగాస్టార్ పైనే..?


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది గతకొంత కాలంగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. గొడవలు ఎందుకు అవుతాయో గాని ఎలక్షన్స్ వస్తే మాత్రం నటీనటులు గ్రూపులుగా విడిపోవడం వైరల్ గా మారింది. ఇక మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కార్యాలయం కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలంతా ఒక చేయి వేస్తే చాలా తొందరగా ఆ బిల్డింగ్ ను సెట్ చేయవచ్చు. అయితే మా లో సఖ్యత లేకపోవడం వలన నేటితరం హీరోలు ఎవరు కూడా అందులోకి రావడం లేదు. ఇక MAA బిల్డింగ్ కోసం చివరికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి రావచ్చని తెలుస్తోంది. స్టార్ హీరోలతో పాటు మెగాస్టార్ ముందుండి అవసరం అయిన డబ్బుతో బిల్డింగ్ నిర్మించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post