ఆచార్య నుంచి మరో లీక్?


మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ ఆచార్య కోసం అభిమానులతో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మొదటిసారి సినిమాలో రామ్ చరణ్ కూడా మెగాస్టార్ తో 40 నిమిషాల పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఇక సినిమాకు సంబంధించిన మరొక విషయం లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. సినిమాలో సంగీత కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలోని అసలు ట్విస్ట్ ఆమె పాత్రతోనే ఉంటుందట. ఆమె చనిపోయే సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయట. హీరోల కలయికకు కూడా ఆ పాత్ర చాలా హెల్ప్ అవుతుందని సమాచారం. మరి ఈ గాసిప్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు అగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post