తెలుగు నాయకులకు కౌంటర్ ఇచ్చేలా.. మెగా హీరో ప్లాన్?


సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఇక ఈ రెండు మార్గాలు వేరైనా కూడా అప్పుడప్పుడు ఎదో ఒక విధంగా క్లాష్ అవుతుంటాయి. ప్రతి సినిమాలో రాజకీయాలపై నాయకులపై కౌంటర్స్ వేయడం కామన్. ఇక ఈసారి అంతకుమించి అనేలా సాయి ధరమ్ తేజ్  నాయకులకు కౌంటర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

దేవకట్టా దర్శకత్వంలో సాయి చేస్తున్న రిపబ్లిక్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇక ఆ సినిమాలో  నాయకులను ఎంచుకునే విధానంపై జనాలకు అవగాహన కల్పించే ఒక పాయింట్ ను హైలెట్ చేస్తారట. అలాగే ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులకు కూడా కౌంటర్ ఇచ్చేలా ఎపిసోడ్స్ కూడా ఉంటాయని టాక్ వస్తోంది. మరి సాయి ధరమ్ తేజ్ ఆ సీన్స్ లో ఎలా నటిస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post