పుష్ప రాజ్.. అంత మంచోడు కాదు!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా విబిన్నంగా ఉండాలని అనుకుంటాడు. అయితే ఈ కాలంలో చాలామంది హీరోలు కథకు అనుగుణంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా మొదటిసారి పుష్ప సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ లో చెడ్డవాడిగా కనిపోస్తాడాని టాక్ వస్తోంది.

సెకండ్ హాఫ్ లో పుష్ప రాజ్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చెడ్డపనులు చేస్తాడట.  ఆ సీన్స్ సినిమాలో హైలెట్ అవుతాయని సమాచారం. అలాగే విలన్స్ ను ముసుగుతో కొట్టే సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయట. దర్శకుడు సుకుమార్ బన్నీలోని నట విశ్వరూపాన్ని చాలా తెలివిగా ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక త్వరలో సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Post a Comment

Previous Post Next Post