RC15: తెలుగు రైటర్ ను సెట్ చేసుకున్న శంకర్


రామ్ చరణ్ 15వ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డైలాగ్స్ కోసం మొదటిసారి దర్శకుడు శంకర్ తెలుగు రైటర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు.

RRR సినిమాకి డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్ర పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక RC 15వ సినిమా కోసం రామ్ చరణ్ సలహా మేరకు శంకర్, సాయి మాధవ్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక సోషల్ మిడియా ద్వారా స్పందించిన సాయి మాధవ్ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను.. అంటూ అందరికి కృతజ్ఞతలు తెలిపారు.


Post a Comment

Previous Post Next Post